అవును, ప్లాంటిక్స్ పార్టనర్ దుకాన్ పూర్తిగా ఉచితం! ఇది ఉచిత హోస్టింగ్ మరియు కమీషన్ రహిత వెబ్‌సైట్, మరియు మేము దానిని అలాగే ఉచితంగా మరియు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంచాలనుకుంటున్నాము.
ప్లాంటిక్స్ పార్టనర్ దుకాన్ ఎందుకు ఉచితం అంటే, మేము వ్యవసాయ- రిటైలర్లకు మరియు రైతుల ఎదుగుదలకు సహాయం చేయాలనే అంకితభావంతో ఉన్నాము. అనుకూలీకరించిన పరిష్కారాలు, విశ్వసనీయ ఉత్పత్తులు మరియు నమ్మకమైన సేవలు గల ఒక డిజిటల్ పర్యావరణ వ్యవస్థలో సన్నకారు రైతులు మరియు స్వతంత్ర రిటైలర్లను అనుసంధానించడం మా లక్ష్యం.
ప్లాంటిక్స్ పర్యావరణ వ్యవస్థ అనేది భారత వ్యవసాయంలో సురక్షితమైన మరియు స్థిరమైన భవిష్యత్తు గురించి శ్రద్ధ వహించే సన్నకారు రైతులు మరియు స్వతంత్ర వ్యవసాయ-రిటైలర్ల నెట్‌వర్క్. వ్యవసాయంలోప్రస్తుతం ఉన్న అంతరాలను తగ్గించాలని, బలమైన సంఘాన్ని సృష్టించాలని మరియు అగ్రి-రిటైలర్లను నేరుగా రైతులతో డిజిటల్‌గా అనుసంధానించాలని మేము కోరుకుంటున్నాము.
మరిన్ని పార్టనర్ దుకాన్‌లను సృష్టించడం అనేది మా డిజిటల్ ప్లాంటిక్స్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో సహాయపడుతుంది. ఇక్కడ:
రిటైలర్ లైసెన్స్ మరియు ఉత్పత్తుల యొక్క ప్రిన్సిపల్ సర్టిఫికేట్లు అవసరం. మీ సరుకుల జాబితాకు చట్టపరంగా సరైన ఉత్పత్తులను జోడించడం మీ బాధ్యత అని దయచేసి తెలుసుకోండి.
మీ పార్టనర్ దుకాన్ ద్వారా మీరు అందుకునే ప్రతి ఆర్డర్‌పై మీరు ప్లాంటిక్స్ లాయల్టీ పాయింట్లను పొందుతారు. ఉదాహరణకు: మీకు రూ. 5,00,000 విలువైన ఆర్డర్ వస్తే, మీరు దీనికి సమానమైన లాయల్టీ పాయింట్లు, అంటే మీరు 5,00,000 ప్లాంటిక్స్ లాయల్టీ పాయింట్లను పొందుతారు.
మీ లాయల్టీ పాయింట్‌లకు సమానమైన బిల్లుపై మీరు 1% డిస్కౌంట్ పొందుతారు. మీ బిల్లు విలువ కంటే మీ లాయల్టీ పాయింట్లు ఎక్కువగా ఉంటే, బిల్లుకు సమానమైన లాయల్టీ పాయింట్లు మాత్రమే పరిగణలోకి తీసుకోబడతాయి. మిగిలిన పాయింట్లను భవిష్యత్తులో మీరు ఉపయోగించుకోవచ్చు.
మీరు ప్లాంటిక్స్ పార్టనర్ యాప్ వెబ్‌సైట్‌లో మీ లాయల్టీ పాయింట్లన్నింటినీ రీడీమ్ చేసుకోవచ్చు.
మీ ప్లాంటిక్స్ పార్టనర్ దుకాన్‌ను సృష్టించుకోవడం అనేది మీ కస్టమర్ బేస్‌ను నిర్మించుకోవడంలో మీకు సహాయపడుతుంది, ఎందుకంటే మీరు మీ కస్టమర్లకు ఎక్కడైనా, ఎప్పుడైనా సేవ చేయగలుగుతారు. ప్లాంటిక్స్ వద్ద, మనం కలిసి ఎదగాలని కోరుకుంటున్నాము. మేము వ్యవసాయ రిటైలర్లందరికీ వారి ప్రాంతంలోని వ్యవసాయ డేటా ఆధారంగా రైతుల కొరకు వ్యవసాయ నిపుణుల సలహాలను అందిస్తాము.
ఇది రైతుల వ్యక్తిగత అవసరాలకు మరియు పర్యావరణానికి సరైన ఉత్పత్తిని అందించడం ద్వారా వారికి సహాయం చేసి అధిక ఖర్చు నుండి వారిని కాపాడుతుంది. పర్యావరణపరంగా మరియు ఆర్థికంగా స్థిరమైన సాగు పద్దతులను సృష్టించడం కోసం, విశ్వసనీయత మరియు జ్ఞానాన్ని పంచుకునే ఒక వృత్తాకార వ్యవస్థను సృష్టించాలనుకుంటున్నాము.
ప్లాంటిక్స్ పార్టనర్ దుకాన్ వెబ్‌సైట్ SHA-256 / RSA ఎన్‌క్రిప్షన్‌తో SSL సర్టిఫికెట్‌ను కలిగి ఉంది, ఇది మొత్తం డేటాకు సురక్షితమైన ఎన్‌క్రిప్షన్ మరియు సురక్షితమైన సైన్-ఇన్‌ను అందిస్తుంది.
మేము మీ ఆన్‌లైన్ దుకాన్‌ను సెటప్ చేయడం ప్రారంభించగలగడానికి వీలుగా "ఉచిత ఆన్‌లైన్ షాప్ పొందండి" బటన్‌ని క్లిక్ చేసి మీ వివరాలను పూరించండి.
ప్రీ పాపులేట్ చేయబడిన మీ ఆన్‌లైన్ షాప్ యొక్క లింక్‌ను మీరు 24 గంటలలోపు అందుకుంటారు.
మీ అన్ని ప్రశ్నల విషయంలో కస్టమర్ కేర్ ఏజెంట్ (CCA) 24 గంటలలోపు మీకు సహాయం చేస్తారు. మీ ఆన్‌లైన్ షాప్ సెటప్ కొరకు మద్దతు అందించడానికి మీకు కేటాయించబడిన కస్టమర్ కేర్ ఏజెంట్ మీకు కాల్ చేస్తారు. మీ సౌలభ్యం మేరకు మీరు కాల్‌ను షెడ్యూల్ కూడా చేయవచ్చు. మా టీం ఇంగ్లీష్, హిందీ, తెలుగు మరియు మరాఠీ భాషల్లో మాట్లాడుతుంది. మీకు మీ భాషలో సహాయం కావాలంటే, దయచేసి మీ కస్టమర్ కేర్ ఏజెంట్‌కు తెలియజేయండి. మీరు నేరుగా అమ్మడం ప్రారంభించగలగడానికి వీలుగా మీ పార్టనర్ దుకాన్‌ను సెటప్ చేయడంలో మీకు సహాయపడటానికి వారు ఉన్నారు.
మీరు మమ్మల్ని వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చు:
https://wa.me/917018485645
లేదా ప్లాంటిక్స్ పార్టనర్ దుకాన్ ఫోన్ లైన్ ద్వారా సంప్రదించవచ్చు:
మధ్యప్రదేశ్: 9109868738
తెలంగాణ: 917880161705
ఆంధ్రప్రదేశ్: 917880161704
మహారాష్ట్ర: 918975571733
పైన పేర్కొన్న నెంబర్లకు మాకు కాల్ చేయండి లేదా మాకు partner-dukaan@plantix.net కి మెయిల్ పంపండి, మేము మీ ఖాతాను వెంటనే రద్దు చేస్తాము.